రామగుండం మండలం గోదావరిఖనిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీపాదరావు 26వ వర్ధంతి సందర్భంగా గోదావరిఖని బస్టాండ్ సమీపంలో శ్రీపాదరావు విగ్రహానికి ఆదివారం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.