రామగుండం: అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

73చూసినవారు
రామగుండం: అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
నిర్దిష్ట అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీతో కలిసి విస్తృతంగా పర్యటించారు. రైల్వే స్టేషన్ ఎదురుగా వీధి వ్యాపారుల కోసం నిర్మిస్తున్న భవనం, పికే రామయ్య కాలనీలోని రోడ్డు నిర్మాణ పనులు, రాజీవ్ రహదారి వద్ద డ్రైనేజీ పనులు, సి. ఎస్. ఆర్ క్లబ్ వద్ద అగ్నివీర్ శిక్షణ కేంద్రం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సందర్శించారు.

సంబంధిత పోస్ట్