రామగుండంలోని సప్తగిరి కాలనీలో ఉన్న మహాత్మ జ్యోతిబా బాలుర గురుకుల పాఠశాలలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ ఝాన్సీ, కనకరాజు, రవితేజ, యువరాజు, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.