తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వికలాంగుల శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి పదవి చేపట్టినంక గోదావరిఖనికి మొదటిసారిగా వచ్చిన సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ ఆదివారం తన అనుచరులతో, కాంగ్రెస్ నాయకులతో ఘనంగా స్వాగతం పలికారు. మంత్రిని, ఎమ్మెల్యేని కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పరపు శ్రీనివాస్, సింహాచలం, తదితరులు ఉన్నారు.