రామగుండం నియోజకవర్గం జనగామలో శ్రీ త్రిలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి రుద్రాభిషేక మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ తన కుటుంబ సభ్యులతో సహా హాజరై స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని అన్నారు.