పాలకుర్తి మండలం పుట్నూరు జయ్యారం గ్రామాలలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ శుక్రవారం వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని ఆరుగాలం కష్టపడి పండించిన అన్నదాతకు అన్యాయం జరవద్దని గత పాలకుల చేతిలో రైతన్నలు చాలా నష్టపోయారని గతంలో మాదిరిగా రైతన్నలను ఇబ్బందులకు గురిచేస్తే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.