జన్మనిచ్చిన తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత వారి పిల్లలదేనని, నిర్లక్ష్యం చేసిన వారిపై చట్ట రిత్యా చర్యలుంటాయని కలెక్టర్ శ్రీహర్ష శనివారం అన్నారు. కలెక్టరేట్‌లో వయో వృద్ధుల సంరక్షణ చట్టం పరిధిలో ఓ కేసును విచారించి తీర్పును చెప్పారు. రామగుండం మండలం ఎఫ్‌సీఐ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు తన కుమారుడు తన సంక్షేమం, పోషణ చూసుకోవడం లేదని దరఖాస్తు చేసుకోగా, విచారణ చేపట్టి 30 రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాలని కలెక్టర్ తీర్పునిచ్చారు.