గోదావరిఖని పట్టణంలోని రమేష్ నగర్ లో అక్రమంగా నిల్వ చేసిన 4. 27 క్వింటాళ్ల రేషన్ బియ్యం, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 13 గృహ సిలిండర్లను పట్టుకున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. గురువారం పట్టణంలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. దోషులపై ప్రజా పంపిణీ వ్యవస్థ నియంత్రణ ఉత్తర్వులు 2016 ప్రకారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.