ప్రభుత్వ ఆసుపత్రిలో 100 శాతం ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. డెలివరీకి సిద్ధంగా ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి పాల్గొన్నారు.