రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా సజావుగా నీటి సరఫరా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం పెద్దపల్లి మండలం బొంపల్లి పెద్దగుట్టలోని పంపింగ్ స్టేషన్ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పంపింగ్ స్టేషన్లో ఏవైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేపట్టి పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట ఈఈ మిషన్ భగీరథ పూర్ణ చందర్ రావుతో పాటు ఇతర అధికారులు ఉన్నారు.