
మహిళా సంఘాల పనితీరు మెరుగుపరచాలి: పెద్దపల్లి కలెక్టర్
జిల్లాలోని మహిళా సంఘాల పనితీరు మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్వశక్తి మహిళా సంఘాల నిర్వహణపై సమీక్ష జరిపారు. జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ లింకేజ్ నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటి వరకు 90 శాతం మేర రుణాలు పంపిణీ పూర్తి చేశామని, పెండింగ్ 10 శాతం రుణాల పంపిణీ 15 వరకు పూర్తి చేయాలన్నారు.