
సన్న బియ్యం పంపిణీ చేసిన రామగుండం ఎమ్మెల్యే
రామగుండం కార్పొరేషన్ 43వ డివిజన్ లో ప్రభుత్వ అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ ఆదివారం ప్రారంభించారు. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నామన్నారు.