రాజన్న ఆలయ అభివృద్ధి గురించి దేవాదాయ శాఖ కమిషనర్ తో చర్చించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ ఆదివారం స్వామి దర్శనం చేసుకున్నారు. తరువాత వేములవాడ వచ్చిన సందర్భంగా కమిషనర్ ను ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కలిసి రాజన్న ఆలయ అభివృద్ధి గురించి మాట్లాడారు. ఇటీవల వీటీడీఏ సమావేశంలోని పలు అంశాలపై చర్చించారు. రాబోవు మహాశివరాత్రి జాతర వైభవంగా నిర్వహించాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.