కామారెడ్డిలో బస్సు ఎక్కిన ఓ ప్రయాణికుడు సిరిసిల్ల బస్టాండ్ వద్దకు బస్సు చేరుకోగానే బస్సు దిగి మరుగుదొడ్డికి వెళ్ళాడు. ఈ క్రమంలో తన బ్యాగును బస్సులోనే మర్చిపోగా బస్సు అప్పటికే వేములవాడకు చేరుకుంది. దీంతో ఆందోళన చెందిన ప్రయాణికుడు వెంటనే వేములవాడ కంట్రోలర్ కు ఫోన్ చేశారు. ఈ క్రమంలో వేములవాడ బస్టాండ్ లో డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ సూపర్వైజర్ సత్యనారాయణ, తదితరులు ప్రయాణికుడికి మర్చిపోయిన బ్యాగ్, డబ్బు అందజేశారు.