లోక కళ్యాణార్థం పుష్య శుద్ధ షష్ఠి ఆదివారం (పుష్యార్కం) జనవరి 5వతేదీ పర్వదినం వేములవాడ పట్టణ బ్రాహ్మణ కుటుంబాల ఆధ్వర్యంలో స్థానిక భీమేశ్వరాలయంలో వెలిసిన అశ్వత్థ నారాయణ సహిత శ్రీఆంజనేయ స్వామివారికి సహస్ర మన్యుసూక్త సహిత అభిషేకం చేశారు. హవనము, శ్రీభీమేశ్వర స్వామి వారికి శతరుద్రాభిషేకము, అన్న పూజ కార్యక్రమాలతోపాటుగా లలితా సహస్రనామ పారాయణం చేశారు. ఆలయాల్లో సందడి వాతావరణం నెలకొంది.