సిరిసిల్ల: అర్బన్ పీహెచ్సీని ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ (వీడియో)

58చూసినవారు
ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీ, ఇతర రిజిస్టర్లు పరిశీలించారు. ఫార్మసీ నిర్వహణ పై పలు సూచనలు చేశారు. రోజు ఓపీ, ఈ నెలలో అర్బన్ పీ హెచ్ సీ పరిధిలో ఎన్ని డెలివరీలు కావాల్సి ఉందో ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్