వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సెలవు దినం సందర్భంగా ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తజనం ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించి.. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుని సేవలో తరించారు. తర్వాత పరివార దేవతలు, ఆలయాలను భక్తజనం సందర్శించారు.