శ్రావణమాస శుక్రవారం సందర్భంగా వేములవాడ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయానికి మహిళ భక్తులు పోటెత్తారు. శ్రావణమాస శుక్రవారం అమ్మవారికి ఒడి బియ్యం, పసుపు, కుంకుమలు, చీర, సారెలు సమర్పించడం ద్వారా అష్టైశ్వర్యాలు, మాంగల్య బలం సమకూర్తాయని మహిళ భక్తులు విశ్వసిస్తున్నారు. అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాస శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేయడం ద్వారా మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు.