సావిత్రి బాయి పూలే ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆమె చిత్రపటానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ జిల్లా అధికారులతో కలిసి శుక్రవారం పూల మాలలు వేసి, నివాళులర్పించారు. మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచి, సమానత్వానికి పోరాడారని వివరించారు.