సిరిసిల్ల: హనుమాన్ భజన చేసి నిరసన తెలిపిన ఉద్యోగులు

77చూసినవారు
సిరిసిల్ల: హనుమాన్ భజన చేసి నిరసన తెలిపిన ఉద్యోగులు
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ 26వ రోజు దీక్షలో భాగంగా శనివారం ఉద్యోగులు అగ్రహారం జోడు ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ భజన చేసి నిరసన తెలియజేశారు. కలెక్టరేట్ చౌరస్తా నుంచి అగ్రహారం జోడు ఆంజనేయ స్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించేలా చూడాలంటూ ఆలయంలో 11 ప్రదక్షిణలు నిర్వహించి, భజనలు చేశారు.

సంబంధిత పోస్ట్