రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల జై సేవాలాల్ రెడ్డి తండా, చందుర్తి మండలం దేవుని తండాలో జరిగిన తీజ్ వేడుకల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతి యువకులతో కలిసి సరదాగా నృత్యాలు చేశారు. తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వారి వెంట ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు ఉన్నారు.