ఈనెల 9న కలకత్తాలో గ్రాడ్యుయేట్ డాక్టర్ హత్యాకాండ కు నిరసనగా ఈ నెల 17వ తేదీన ఓపి సేవలు నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు రేపు ఓపి సేవలు బంద్ చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంతోపాటు సమీప గ్రామాల ప్రజలు సహకరించాలని వైద్యులు ఒక ప్రకటనలో కోరారు. వేములవాడ పట్టణంలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో రేపు ఓపి సేవలు బంద్ చేస్తున్నట్లు చెప్పారు.