నిరంతరం విధులు నిర్వహించే పోలీసులు నిత్యం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టుసాధించవచ్చని, నిత్యజీవితంలో యోగ ఒక అలవాటుగా మార్చుకోవాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు. శనివారం రోజున ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద యోగా కార్యాక్రమాన్ని నిర్వహించి యోగా నిపుణులచే పోలీస్ అధికారులకు, సిబ్బందికి యోగాలో శిక్షణనిచ్చారు.