రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల సంక్షోభాన్ని నివారించి నేతన్నలకు ఉపాధి కల్పించే వరకు రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తామని వస్త్ర పరిశ్రమల అనుబంధ సంఘాల జేఏసీ నాయకులు శుక్రవారం ప్రకటించారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 12వ రోజుకు చేరుకున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు.