పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయులను ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాలలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వసతి గృహం ఆవరణను పరిశీలించారు. అక్కడి నుంచి కిచెన్, స్టోర్ రూంకు వెళ్లి సరుకుల నాణ్యత, ఆహార పదార్థాలను పరిశీలించి, పలు సూచనలు చేశారు.