2023 సంవత్సరానికి గాను కార్మికులకు రావలసిన 10శాతం యారన్ సబ్సిడీ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ అన్నారు. సిరిసిల్ల పట్టణంలో శనివారం ఆయన మాట్లాడారు. పాలిస్టర్ చేనేత కార్మికులకు కూడా కూలీలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతి ఒక్క కార్మికులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.