గోవులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

69చూసినవారు
గోవులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
వర్షాకాలం నేపథ్యంలో గోశాలలోని గోవులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి చెందిన గోశాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోశాలలో క్షేత్ర ప్రదర్శన చేసి, గోవులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. గోశాలను పరిశుభ్రంగా ఉంచాలని, నిత్యం వాటిని పర్యవేక్షిస్తూ సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్