శిశువుకు తల్లి పాలే శ్రీరామ రక్ష: కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

70చూసినవారు
శిశువుకు తల్లి పాలే శ్రీరామ రక్ష: కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
శిశువుకు తల్లి పాలే శ్రీరామ రక్ష అని, తల్లి పాల విశిష్టతను వారోత్సవాల కార్యక్రమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సిరిసిల్ల సివిల్ ఆసుపత్రిలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లి పాల వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్