విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి: కలెక్టర్

67చూసినవారు
విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి
లోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, డైనింగ్ హాల్ ను పరిశీలించారు. విద్యాలయంలో ఎందరు విద్యార్థులు చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్