వేములవాడ పట్టణంలోని కోనాయిపల్లిలో మట్టి నమూనాలపైన శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మట్టి నమూనాను తీసే విధానం, దాని ఉపయోగాలు తెలిపారు. మట్టి నమూనాల పరీక్ష ఫలితాల ద్వారా భూమి సారం, పదార్థాలు అందులోని కర్బన పదార్థం, ఎన్ని ఎరువులు వాడాలనే అంశాలు మనకు తెలుస్తాయని, ఈ విధంగా వేములవాడ మండలంలోని గ్రామాల్లో మట్టి నమూనాలను ఏఈవోల ద్వారా సేకరించినట్లు చెప్పారు.