ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన గ్రామాల్లో పర్యటించాలని, నిత్యం పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రత్యేక అధికారులు క్రమం తప్పకుండా గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు. శుక్రవారం డ్రై డే గా పాటించాలని ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త వేరు చేసేలా అవగాహన కల్పించాలన్నారు.