ఎల్లారెడ్డిపేట: యువకుడిపై ఎలుగుబంటి దాడి

74చూసినవారు
ఎల్లారెడ్డిపేట: యువకుడిపై ఎలుగుబంటి దాడి
ఎలుగుబంటి దాడిలో ఎల్లారెడ్డిపేట మండలంలోని గుట్టపల్లి చెరువు తండాకు చెందిన నరేశ్‌ గాయపడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం భూక్య నరేశ్ బుధవారం ఉదయం గొర్రెలను మేత కోసం అడవికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే ఓ చెట్ల పొదల్లో దాగి ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా నరేశ్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో అతడి చేతికి గాయం అయింది. స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తండావాసులు భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్