దుబాయిలో వేములవాడ వాసి మృతి

56చూసినవారు
దుబాయిలో వేములవాడ వాసి మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రికి చెందిన చంద్రకాంత్ అనే గల్ఫ్ కార్మికుడు అనారోగ్యంతో అబుదాబిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గతనెల 29న మృతి చెందాడు. అయితే 1992 నుంచి దుబాయ్ వెళ్తున్న చంద్రకాంత్. మృతి చెందటం పట్ల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. ఈనెల 2న మృతదేహం స్వగ్రామానికి చేరనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్