వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కోలాహలం

53చూసినవారు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయం సందడిగా మారింది. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత. కోడె మొక్కులు చెల్లించుకొని సేవల తరించారు.

సంబంధిత పోస్ట్