రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో లింగంపల్లి గ్రామంలోని మూల వాగులో ఇసుక రీచ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు. 30 ట్రాక్టర్లకు గాను ఒక్కో ట్రాక్టర్ కి మూడు ట్రిప్పుల చొప్పున ఇసుక తరలింపుకు డిడి రుసుము చెల్లించారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.