దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని హైద్రాబాద్ ప్రాంతానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి సేవలో తరించారు. మొదటిసారిగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించడానికి కుటుంబ సమేతంగా వచ్చామని, దర్శనం చాలా బాగా జరిగిందని పేర్కొన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ దర్శనంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.