రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి: కాంగ్రెస్ నేతలు

75చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్నారని కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్కలదేవి శ్రీనివాస్ అన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన నేపథ్యంలో బస్టాండ్ ప్రాంతంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్