రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం నిమ్మపల్లి గొల్లపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీచౌడలమ్మ కళ్యాణ మహోత్సవంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. సందర్భంగా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు.