రాజన్న ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. భక్తులు ఉదయాన్నే ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడె మొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 11: 30 వరకు సుమారుగా 20వేల 721 భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు ప్రకటనలో తెలిపారు. సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు