వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ఓపెన్ స్లాబ్ లో బుధవారం హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో వినోద్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సిసి కెమెరాలు, పోలీస్, ఎస్పిఎఫ్ సిబ్బంది నిఘా నీడలో హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని చేస్తున్నట్లు ఈవో తెలిపారు. ప్రతినెల 15నుంచి 20రోజుల వ్యవధిలో హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం ఉంటుంది.