అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి మండల కేంద్రానికి విచ్చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టీయూడబ్ల్యూజే ఐజేయు రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దాసరి దేవేందర్లు వినతిపత్రం సమర్పించారు.