కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలోనీ భగవాన్ శ్రీసత్యానంద మహర్షి ఆశ్రమ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ కు ఆలయ అర్చకులు, కమిటి సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆశ్రమంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న చండీ హోమంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీజగదాంబ సమేత శ్రీతారకేశ్వర స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.