జాతీయ బీసీ సంక్షేమ సంఘం వీర్నపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి, భూమి లేని అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ భూమి ఇవ్వాలని మండలం తహశీల్దార్ కు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వీర్నపల్లి మండల అధ్యక్షులు పరామల మల్లేశం యాదవ్, జిల్లా అధ్యక్షులు మ్యాకల పరుశురాం, జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేశ్ ఉన్నారు.