జమ్మికుంట పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి చెందిన కారు ఆదివారం ఉదయం హుజురాబాద్ నుండి జమ్మికుంటకు వస్తున్న క్రమంలో డివైడర్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న బైక్ వేగంగా ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న పెద్దంపల్లి చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 కి సమాచారం అందించగా క్షతగాత్రులను ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.