వేములవాడ పట్టణంలోని బద్దిపోచమ్మ తల్లికి ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ పేరిట భక్తిశ్రద్ధలతో బుధవారం జానపద కళాకారులు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా జానపద గాయకుడు, రచయిత మాట్ల తిరుపతి మీడియాతో మాట్లాడుతూ రెండవ సంవత్సరం యూట్యూబ్ తల్లి, గూగులమ్మ బోనాలు బద్ది పోచమ్మకు సమర్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గూగులమ్మ అంటూ ప్రత్యేకమైన పాటను పాడి అలరించారు.