రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని వాకర్స్ ఆధ్వర్యంలో రథసప్తమి నేపథ్యంలో మంగళవారం ఉదయం సూర్య నమస్కారాలు చేశారు. మార్నింగ్ వాకర్స్ అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్య నమస్కారాలు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమస్త మానవాళికి సూర్య భగవానుడు ఎంతో మేలు చేస్తున్నాడని వాకర్స్ సభ్యులు తెలిపారు.