వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 28 రోజుల రాజన్న హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. రూ. 1 కోటి 87 లక్షల 20 వేల 966 రాగా.. కానుకల రూపంలో బంగారం 115 గ్రాముల 900 మిల్లి గ్రాములు, వెండి 9 కిలోల 500 గ్రాములు వచ్చినట్లు ఈవో వినోద్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.