వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తులు రద్దీ నెలకొంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు మీడియాతో మాట్లాడుతూ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి తన సోదరితో కలిసి వచ్చానని, స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని పేర్కొన్నారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులు కోడె మొక్కులతో పాటు తలనీలాలు సమర్పించుకున్నారు.