వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామంలోని బాలసాని పరశురాం గౌడ్ ఇంటిని ఆనుకుని ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం దర్శనమిస్తుంది. గతంలో పలుమార్లు సెస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరారు.