హీరోయిన్ రష్మిక, ధనుష్, నాగార్జున కలిసి నటిస్తున్న చిత్రం 'కుబేర'. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం నుంచి "పీ పీ డుమ్ డుమ్" అనే వీడియో సాంగ్‌ను చిత్ర బృందం బుధవారం రిలీజ్ చేసింది. చైతన్య రాసిన ఇంగ్లిష్ లిరిక్స్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. పాట మొత్తం ఇంగ్లిష్ పదాలతోనే ఉండడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించారు. ఈ మూవీ జూన్ 20న విడుదల కానుంది.